Dalit Poetry | మానవతా దర్శనమే సామాజిక ఔషధం | Dr Katti Padma Rao Poem on Floating Bodies in Ganga
Dalit Poetry మానవతా దర్శనమే సామాజిక ఔషధం Dr Katti

Dalit Poetry | మానవతా దర్శనమే సామాజిక ఔషధం | Dr Katti Padma Rao Poem on Floating Bodies in Ganga

Dalit Poetry | మానవతా దర్శనమే సామాజిక ఔషధం | Dr Katti Padma Rao Poem on Floating Bodies in Ganga

Dalit Poetry | మానవతా దర్శనమే సామాజిక ఔషధం | Dr Katti Padma Rao Poem on Floating Bodies in Ganga
#Dalit #Poetry #మనవత #దరశనమ #సమజక #ఔషధ #Katti #Padma #Rao #Poem #Floating #Bodies #Ganga
Dalit Poetry | మానవతా దర్శనమే సామాజిక ఔషధం | Dr Katti Padma Rao Poem on Floating Bodies in Ganga
#kattipadmaraopoetry #kattipadmaraospeech #Dalitliteratue #BlackScreen

కవిత : మానవతా దర్శనమే సామాజిక ఔషధం #kattipadmaraopoems
కవి : #కత్తిపద్మారావు #kattipadmarao
కవితాపఠనం : చేతన్ కత్తి #chetankathi

మనుషులు వెనక్కి నడుస్తున్నారా!?
ధైర్యాన్ని కోల్పోతున్నారా!?
ఆత్మస్థైర్యమే నిజమైన ఔషధం
అతడికి వెండితాపడంతో చేసిన స్విమ్మింగ్ ఫూల్ ఉంది.
అందులో రోజూ ఈత వేస్తాడు.
బంగారు పూతపూసిన సింహాసనం మీద కూర్చుంటాడు.
ఒకసారి అతడికి ఊపిరి అందలేదు.
ఆక్సిజన్ దొరకలేదు.
అతడు హీరోనే మరి!
అతడు తనకు విలన్ గా నటించిన వాడిని ప్రాణభిక్ష
అడిగాడు!
మనసు సంకుచితమైతే
అల్పప్రాణులేగా.
ఉపరితలం ఎంత కీర్తివంతమైనా అది ఫలవంతం కాదు.
త్యాగ వృక్షమే ఫలాలు కాస్తుంది.
అతడికి వేల ఎకరాల భూములున్నాయి.
ఎన్నో భవంతులున్నాయి.
ఏదీ కరోనా షెల్టరుగా మారలేదు.
స్వీయ దానాన్ని చేయలేని వాడు పర దానాన్ని
ఏమి చేయగలడు?
దుఃఖం అమ్ముడు పోతుందంటే
సినిమావాళ్ళు దానికే
రంగులు పూసి అమ్ముతారు!
ఇప్పుడు తెలంగాణా జానపదాన్ని వెస్ట్రన్ బీట్ తో
మిక్స్ చేసి కర్ణాటక
లయలో వినిపిస్తున్నారు.
ఆ పాలకుడివన్నీ
బూటకపు మాటలే.
విషణ్ణ వదనాలు,
విషయుక్తమైన చూపులు!
ఏ ఆక్రందనలు విననివ్వడు.
భజంత్రీలు, బాకాలు!
జనం నోళ్ళలో గుడ్డలు మెలేసి
నొక్కుకుంటున్నారు!?
వాడు అబద్ధాలు ప్రచురించి
కోట్లు గడిస్తున్నాడు.
అతణ్ణి అందరూ నేరస్థుడని
పిలవడం అతనికి ఇష్టం.
అక్షరమైనా,దృశ్యమైనా
అతడికి సరుకే!
అతడు అర్ధరాత్రి
రెండు గంటల వరకు నిద్రపోడు!
ఏదైనా విషగుళికను సృష్టించి
శీర్షికగా పెట్టి ఆనందిస్తాడు.
పవిత్ర గంగానదీ తరంగాలలో
మనుషుల శవాలు తేలుతున్నాయి
శవాల్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు
అతణ్ణి కదిలించడం లేదు!?
అతడి మనోవ్యవస్థలోని
కర్కశత్వం విశ్లేషణకు
అందడంలేదు.
జీవశాస్త్రాన్ని విస్మరించారు.
నీరు ఒక జీవశాస్త్ర0.
వాయువు ఒక జీవన శాస్త్రం.
ప్రకృతి శక్తుల్ని దేవుళ్ళని చేశారు.
కరోనా దేవుళ్ళకు
శక్తి లేదని తేల్చింది.
మనిషే దేవుణ్ణి సృష్టించాడని
ప్రకటించింది.
సోమరులు గుహలో దాక్కుని
మాట్లాడుతున్నారు!?
వాక్కు కి వుండే గౌరవాన్ని
దెబ్బతీశారు.
గాజా పై ఇజ్రాయిల్ దాడిని
సమర్ధిస్తున్న వాడుకూడా
ఒక మత సామ్రాజ్యవాదే.
రాష్ట్రాల అవసరాలను
నిషేధిస్తున్న వాడు కూడా
ఒక నియంతే!
జీవించే హక్కును కాలరాసే చర్య ఒక రాజ్యాంగ ఉల్లంఘనే.
జీవశాస్త్రం-జీవనశాస్త్రం
అనుబంధితాలు.
మనుషులు అంతర్ముఖులు
కాలేకపోతున్నారు.
విధ్వంసానికి మూలం
అంతర్గత నైరాశ్యం.
గణితంలో హెచ్చవేతలూ,
కూడికలే కాదు తీసివేతలు కూడా ఉంటాయి.
తీసివేతలు జరిగాకే సరైన
సమాధానం వస్తుంది.
ఆధిపత్యం అహాన్ని తేగూడదు.
సున్నితమైనవన్నీ పదునైనవే.
పువ్వులో వుండే తేనెతోనే కదా
ఔషధం తయారయ్యేది.
పువ్వులు కాలితో తొక్కాక
ఔషధం ఎక్కడి నుండి వస్తుంది?
ప్రతి మనిషి తన మృదుత్వాన్ని
నాశనం చేస్తున్నాడు.
బంగారు ఆభరణాలు చేయించి
విగ్రహాలకు ధరింపజేశాడు.
ఇప్పుడు ఆ విగ్రహాలకు
పెనుబాములు చుట్టుకున్నాయి
అభూతాలన్నింటి విశ్వరూపం
బయటకొస్తుంది.
ప్రకృతి-మనిషి సమన్వయంతో
జీవించాలి.
ప్రకృతి ప్రకోపం
విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
జీవించడమనేదే మానవ ధర్మం
ఇతరుల శ్రమను దోచుకుని
జీవించడమే అధర్మం.
స్వీయజీవనమే మానవతా
దర్శనం.
మానవతా దర్శనమే
నేటి పరమ ఔషధం.
• Speechs on Ambedkar, Phule, Periyar, Jashuva https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLO7rhQqrKtNIGE2oWnDp8J
• Caste Politics https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLNAr8URPPElU-WeYwTcgqM
• Karamchedu https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBIPFbCPuhOVBpBVsp023k46
• Master Classes https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBLH131WZZYBKiMNV3QW2vBg
• Katti Padma Rao Inspiring Speechs https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBL4QNa_lb6vEfBhPRIdztie
• Dalit Poetry https://www.youtube.com/playlist?list=PLT3rsQvl5JBJA0tJiBq4QUo2Ft6t6_MDs

• Face Book : https://www.facebook.com/FounderDalitMovement/
• Twitter : https://twitter.com/kattipadmarao?lang=en
• instagram : https://www.instagram.com/blackscreenin/

Black Screen channel intends to bring the voice of neglected. It will be the voice of voiceless in culture, education, politics through the new eye.
Till today we silver screen has dominated us. Let us build a new visual world with our own history and our own views through Black Screen.
Black Screen Blackscreen #BlackScreen #blackscreen
#Dalit #Poetry #మనవత #దరశనమ #సమజక #ఔషధ #Katti #Padma #Rao #Poem #Floating #Bodies #Ganga
UCFmb55W3VbvKUd9jen06LZg
Black Screen
Dalit Poetry | మానవతా దర్శనమే సామాజిక ఔషధం | Dr Katti Padma Rao Poem on Floating Bodies in Ganga

Leave a Reply